చిరంజీవితో రామచందర్ రావు భేటీ
NEWS Jun 22,2026 02:08 pm
చిరంజీవితో టీ-బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు భేటీ అయ్యారు. ప్రధాని మోదీ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తిచేసుకున్న సందర్భంగా BJP చేపట్టిన ‘విశేష్ జన్ సంపర్క్ అభియాన్’లో భాగంగా చిరును కలిశారు. మోదీ హయాంలో కేంద్ర ప్రభుత్వం సాధించిన కీలక విజయాలు, చేపట్టిన సంక్షేమ పథకాల గురించి చిరంజీవికి రామచందర్ వివరించారు. బుక్‌లెట్‌ను అందజేశారు. మోదీ 12 ఏళ్ల పాలనపై ఇటీవల సినీ, బిజినెస్ ప్రముఖులతో రామచందర్ రావు వరుసగా భేటీ అవుతున్నారు.