విషాదం.. కుటుంబం సామూహిక ఆత్మహత్య
NEWS Jun 22,2026 10:28 am
చిత్తూరు జిల్లా బంగారెడ్డిపల్లెలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్నారు. దామోదరం, నిర్మల దంపతులకు ఇద్దరు చిన్నారులు. కొద్దిరోజుల క్రితం నిర్మలకు బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో చికిత్స కోసం భారీ ఖర్చులు చేయాల్సి వచ్చింది. ఆర్థిక ఇబ్బందులు, భార్య ఆరోగ్య పరిస్థితి క్షీణించడం వల్ల దామోదరం తీవ్ర మానసిక ఒత్తిడికి గురైనట్లు తెలుస్తోంది. ఇంట్లో భార్య, ఇద్దరు పిల్లలకు విషం ఇచ్చి, అనంతరం తాను ఉరేసుకుని మృతి చెందినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనాస్థలంలో లభించిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.