సమంత మూవీ ‘మా ఇంటి బంగారం’ బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతోంది. దర్శకురాలు నందిని రెడ్డి తెరకెక్కించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ విడుదలైన తొలి రోజు నుంచే ప్రేక్షకుల ప్రశంసలు అందుకుంటూ మొదటి రోజే రూ.13 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించింది. రెండో రోజు శనివారం వీకెండ్ అడ్వాంటేజ్‌తో మరింత జోరు చూపించి రూ.15 కోట్లకు పైగా వసూళ్లు నమోదు చేసింది. 2 రోజుల్లోనే ప్రపంచవ్యాప్తంగా రూ.28 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది.