11 బంతుల్లోనే వైభవ్ హాఫ్ సెంచరీ!
NEWS Jun 21,2026 11:25 am
భారత యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ శ్రీలంకలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ ఫైనల్లో శ్రీలంక ‘A’ జట్టుపై కేవలం 11 బంతుల్లోనే అర్ధశతకం సాధించి, లిస్ట్-ఎ క్రికెట్ చరిత్రలో అత్యంత వేగవంతమైన హాఫ్ సెంచరీ నమోదు చేసిన బ్యాటర్‌గా రికార్డు సృష్టించాడు. 29 బంతుల్లో 10 ఫోర్లు, 8 సిక్సర్లతో 94 పరుగులు చేసిన వైభవ్, ప్రియాంశ్ ఆర్యతో కలిసి తొలి వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇటీవల జరిగిన వివాదాస్పద మ్యాచ్‌కు బ్యాట్‌తోనే సమాధానం చెప్పిన వైభవ్ ప్రదర్శనతో భారత్ ‘ఎ’ జట్టు టైటిల్ దిశగా దూసుకెళ్తోంది.