లారీ ప్రమాదం - డ్రైవర్‌కు గాయాలు
NEWS Jun 21,2026 05:41 am
మొండికుంట సమీపంలోని సాయిబాబా ఆలయం వద్ద ఇసుక లారీ అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ఘటన చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం, కొత్తగూడెం వైపు వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో నియంత్రణ కోల్పోయి రోడ్డుపక్కనున్న చెట్టును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. అతని చేతులు, కాళ్లు విరిగినట్లు సమాచారం. ప్రమాదం అనంతరం డ్రైవర్ వాహనంలో ఇరుక్కుపోగా, సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని అతడిని బయటకు తీశారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.