బంగ్లాదేశ్‌లో కదంతొక్కిన హిందువులు
NEWS Jun 20,2026 10:15 pm
బంగ్లాదేశ్: గైబంధ జిల్లాలో 81 అడుగుల శ్రీరాముడి విగ్రహ నిర్మాణానికి అనుమతి ఇవ్వాలంటూ హిందూ సంఘాలు ఢాకాలో భారీ నిరసన చేపట్టాయి. నిర్మాణంలో ఉన్న రాముడి విగ్రహ పనులను ప్రభుత్వం నిలిపివేయడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన వేలాది మంది హిందువులు, విద్యార్థులు కాగడాలతో ర్యాలీ నిర్వహించారు. ఢాకాలో సాగిన ఈ ర్యాలీలో “జై శ్రీరామ్” నినాదాలు మార్మోగాయి. రాముడి చిత్రపటాన్ని అవమానించిన వారిపై చర్యలు తీసుకోలేదని, డిమాండ్లు నెరవేర్చకపోతే దేశవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పోలీసులు నిరసనలను అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.