మెట్‌పల్లి వారసంతలో చోరీల కలకలం
NEWS Jun 03,2026 10:06 am
మెట్‌పల్లి పట్టణంలో ప్రతి మంగళవారం నిర్వహించే వారసంతలో చోరీలు చోటుచేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది. సెల్‌ఫోన్లు, పర్సులు చోరీకి గురైనట్లు పలువురు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రద్దీని ఆసరాగా చేసుకున్న చోరులు కూరగాయలు విక్రయించే వ్యాపారులు, కొనుగోలుదారులను లక్ష్యంగా చేసుకుని చేతివాటం ప్రదర్శించినట్లు సమాచారం. వారసంతకు వచ్చే ప్రజలు తమ విలువైన వస్తువుల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, అనుమానాస్పద వ్యక్తులపై సమాచారం అందించాలని పోలీసులు సూచిస్తున్నారు.