హనుమంత్‌రావును కలిసిన గంప ప్రసాద్
NEWS Jun 03,2026 04:38 am
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బీసీ సలహాదారు వి. హనుమంత్‌రావును కామారెడ్డి పట్టణంలో డీసీసీ ఉపాధ్యక్షుడు గంప ప్రసాద్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనకు శ్రీ వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని అందజేసి సత్కరించారు. అనంతరం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. రాష్ట్ర అభివృద్ధి, బీసీ వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలపై కూడా చర్చించినట్లు సమాచారం.