ఎందరో త్యాగాల ఫలితమే తెలంగాణ
NEWS Jun 03,2026 12:14 am
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని మెట్‌పల్లిలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేశారు. ప్రభుత్వ ఆసుపత్రి ఆవరణలో నిర్వహించిన జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ ఎందరో ప్రజల త్యాగాలు, దీర్ఘకాల ఉద్యమాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని గుర్తు చేశారు. అమరుల ఆశయాలకు అనుగుణంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.