బాసర IIITలో సీటు సాధించిన విద్యార్థులకు ఎమ్మెల్యే సంజయ్ సన్మానం
NEWS Jun 03,2026 12:09 am
బాసర IIITలో సీట్లు సాధించిన నియోజకవర్గానికి చెందిన 42 మంది విద్యార్థులను ఎమ్మెల్యే సంజయ్ మెట్‌పల్లిలో ఘనంగా సన్మానించారు. విద్యార్థులకు షీల్డ్‌లు అందజేసి అభినందనలు తెలిపారు. ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని కష్టపడి చదివితే మరిన్ని విజయాలు సాధించవచ్చని సూచించారు. అనంతరం విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారిని ప్రోత్సహించారు. ఎంఈఓ కనకతార, ప్రధానోపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.