శుభాకాంక్షలు తెలిపిన సర్పంచ్ శిరీష రవి
NEWS Jun 02,2026 02:04 pm
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎల్లారెడ్డి నియోజకవర్గం సదాశివనగర్ మండల, గ్రామ ప్రజలకు సర్పంచ్ వంకాయల శిరీష రవి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన విద్యార్థులు, యువకులు, పోలీస్ కానిస్టేబుల్ కిష్టయ్యతో పాటు ఉద్యమ అమరవీరుల సేవలను స్మరించుకున్నారు. వారి త్యాగాలు, ఆత్మబలిదానాల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిందని, అమరవీరుల ఆశయాలకు అనుగుణంగా తెలంగాణ అభివృద్ధి పథంలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ వారికి ఘనంగా నివాళులు అర్పించారు. తెలంగాణ ప్రజలందరికీ మరోసారి రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.