మొబైల్ ఫోన్ అప్పగించిన త్రీ టౌన్ పోలీసులు
NEWS May 28,2026 11:08 pm
కొత్తగూడెం ప్రగతి నగర్‌కు చెందిన చంద్రగిరి నాగేశ్వరరావు మొబైల్ ఫోన్ చోరీకి గురికావడంతో స్థానిక త్రీటౌన్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి, చోరీకి గురైన మొబైల్ ఫోన్ నల్గొండలో ఉన్నట్లు గుర్తించారు. అనంతరం అక్కడి నుంచి ఫోన్‌ను స్వాధీనం చేసుకుని కొత్తగూడెంకు తెప్పించారు. త్రీటౌన్ సీఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బాధితుడు చంద్రగిరి నాగేశ్వరరావుకు మొబైల్ ఫోన్‌ను అప్పగించారు. 4 నెలల క్రితం పోగొట్టుకున్న ఫోన్ తిరిగి లభించడంతో బాధితుడు పోలీసులకు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు.