బాధితులను పరామర్శించిన పైడి ఎల్లారెడ్డి
NEWS May 28,2026 11:06 pm
రాజంపేట మండలం ఎల్లారెడ్డిపల్లి తండా గ్రామపంచాయతీ పరిధిలో ఉపాధి హామీ పనులకు వెళ్తున్న కూలీలతో ప్రయాణిస్తున్న ట్రాక్టర్ రెండు రోజుల క్రితం ప్రమాదవశాత్తు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో పలువురు కూలీలు గాయపడగా వారిని కామారెడ్డి ఏరియా ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జపాన్ శత్రావేత్త, పైడి ఎల్లారెడ్డి పరామర్శించారు. అనంతరం వైద్యులతో మాట్లాడి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని వారు హామీ ఇచ్చారు.