రూ.1.1 లక్షల కోట్లు జనం వదిలేశారా?
NEWS May 26,2026 02:37 pm
దేశంలో ఎవరూ పట్టించుకోని ఆర్థిక ఆస్తులు పేరుకుపోతున్నాయి. తాజా లెక్కల ప్రకారం 2025-26 ముగింపు నాటికి క్లెయిం చేయని ఆస్తుల విలువ ఏకంగా రూ.1.1 లక్షల కోట్లకు చేరింది. బ్యాంకులు, బీమా సంస్థలు, ఈక్విటీ మార్కెట్లలో యజమానుల జాడలేక ఈ నిధులు పేరుకుపోతున్నాయి. కేంద్రం ‘మీ డబ్బు-మీ హక్కు’ అని చెబుతున్నా పట్టించుకునే వారే లేరు. మొత్తం రూ.1.1 లక్షల కోట్లలో రూ.83,000 కోట్లు బ్యాంకు డిపాజిట్ల రూపంలో, రూ.10,000 కోట్లు ఈక్విటీ పెట్టుబడులు, రూ.14,000 కోట్లు జీవిత బీమా పాలసీల రూపంలో క్లెయిం చేయకుండా ఉన్నాయి.