ముగ్గురిపై కేసు - పశువుల స్వాధీనం
NEWS May 26,2026 02:41 pm
అశ్వాపురం మండలం పాములపల్లి గ్రామం నుంచి అక్రమంగా మూడు పశువులను పాల్వంచకు తరలిస్తున్న సమయంలో పోలీసులు తనిఖీలు నిర్వహించి పట్టుకున్నారు. ఈ ఘటనలో పాల్వంచ రూరల్ పాండురంగాపురానికి చెందిన కుర్ర హనుమాన్, బానోతు సురేష్, భూక్య సాగర్‌లపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. అక్రమంగా తరలిస్తున్న పశువులను స్వాధీనం చేసుకుని సంరక్షణ కోసం గోశాలకు తరలించారు. పశువుల రవాణా సమయంలో తప్పనిసరిగా సంబంధిత అనుమతి పత్రాలు, రవాణా పత్రాలు వెంట ఉంచుకోవాలని పోలీసులు సూచించారు. అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.