వెన్నెల వెలుగులో చేప ప్రసాదం
NEWS May 19,2026 12:14 pm
హైదరాబాద్: బత్తిని కుటుంబం నిర్వహణలో చేప ప్రసాదం పంపిణీ జూన్ 8 రాత్రి 9 గంటలకు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో ప్రారంభం కానుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మృగశిర కార్తి ముహూర్తం సూర్యాస్తమయం తర్వాత రావడంతో (15 ఏళ్ల తర్వాత) రాత్రి ప్రారంభానికి నిర్ణయం తీసుకున్నారు. 180 ఏళ్లుగా బత్తిని కుటుంబం చేప ప్రసాదాన్ని ఉచితంగా అందిస్తోంది. ఆస్తమా, శ్వాసకోశ సమస్యలకు ఉపశమనం కలుగుతుందనే నమ్మకంతో ప్రజలు తరలివస్తుంటారు.