టెలికం సంస్థల తీరుపై నరసింహ ఫైర్
NEWS May 06,2026 08:19 pm
గత కొన్ని నెలలుగా టెలికం సంస్థల సేవల వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కెవి నరసింహ ఆవేదన వ్యక్తం చేశారు. జియో, ఎయిర్టెల్, వీఐ, బీఎస్‌ఎన్‌ఎల్ తదితర టెలికం సంస్థల కాల్స్ మాట్లాడుతుండగానే అకస్మాత్తుగా కట్ అవ్వడంతో, వినియోగదారులు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారని అన్నారు. నెలకు రూ.349, 3 నెలలకు రూ.999 వంటి భారీ రీఛార్జ్ ప్యాకేజీలు చేసుకుంటున్నప్పటికీ, వినియోగదారులకు సరైన సేవలు అందడం లేదని విమర్శించారు.