సీపీ సుమతిని వేధించిన పోకిరీలు
NEWS May 06,2026 01:02 pm
మల్కాజ్‌గిరి కమిషనర్‌గా బాధ్యతలు తీసుకున్న తొలి రోజు మహిళల భద్రత కోసం అర్ధరాత్రి ఆపరేషన్ చేపట్టారు. సగటు మహిళగా ఆమె బస్టాండ్‌లో నిల్చున్నారు. సాధారణ మహిళలకు ఎదురయ్యే వేధింపులు ఎదుర్కొన్నారు. సీపీ అని తెలియక సుమతి చుట్టూ 40 పోకిరీలు చేరారు. రకరకాల ప్రశ్నలతో వేధించారు. వీరిలో ఎక్కువ మంది విద్యార్థులే ఉన్నారు. ఆ తర్వాత అక్కడికి చేరుకున్న పోలీసులు.. వీరిని అదుపులోకి తీసుకుని కౌన్సెలింగ్ ఇచ్చారు.