పెళ్లికి ముందు ప్రేమికుల ఆత్మహత్య
NEWS May 04,2026 09:14 am
మల్లాపూర్ (జగిత్యాల): మక్కల సాయికుమార్ (పాత దాంరాజుపల్లి), ఒల్లె శ్రుతి (సిరిపూర్) ప్రేమించుకుని పెద్దల సమ్మతితో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇల్లు కట్టుకున్న తర్వాతే పెళ్లి చేసుకుందామని సాయి బహ్రెయిన్‌కు వెళ్లాడు. అక్కడ ఆర్థిక ఇబ్బందులు, పని ఒత్తిడి తాళలేక మే 1న ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలిసిన శ్రుతి తీవ్ర మనస్తాపానికి గురై అదే రోజు ఇంట్లో ఉరి వేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనతో 2 గ్రామాల్లో తీవ్ర విషాదం నెలకొంది.