నీట్ పరీక్షల కోసం విస్తృత ఏర్పాట్లు
NEWS May 03,2026 04:35 pm
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఆదివారం నిర్వహించనున్న నీట్ పరీక్షల కోసం జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. జిల్లాలో 3 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు అన్ని చర్యలు చేపట్టారు. సింగరేణి ఉమెన్స్ డిగ్రీ & పీజీ కాలేజీ, ఎస్ ఆర్ గౌట్ ఆర్ట్స్ & సైన్స్ కాలేజీ, TGSWR స్కూల్ & పీజీ కాలేజీల్లో మొత్తం 1078 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థులకు తాగునీరు, వైద్య సదుపాయాలు, రవాణా వంటి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు అధికారులు తెలిపారు. పరీక్షా కేంద్రాల సమీపంలో బీఆర్–163 సెక్షన్ అమలు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.