ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి
NEWS May 01,2026 05:33 pm
దిలవార్పూర్ మండలం సిర్గాపూర్ గ్రామంలో నిర్మాణంలో ఉన్న ఇందిరమ్మ ఇండ్లని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా పరిశీలించారు. లబ్ధిదారురాలు మౌనికతో మాట్లాడి నిర్మాణ పురోగతి, ఖర్చు వివరాలు, ప్రభుత్వ నిధుల వినియోగంపై తెలుసుకున్నారు. మిగిలిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. హౌసింగ్ శాఖ అధికారులకు నాణ్యతా ప్రమాణాలు తప్పనిసరిగా పాటించాలని ఆదేశించారు. నిర్మాణం ప్రతి దశను యాప్‌లో ఫోటోలతో నమోదు చేయాలని, నిధులు సకాలంలో విడుదలయ్యేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. సంబంధిత అధికారులు పాల్గొన్నారు.