తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన
NEWS Apr 30,2026 06:55 pm
భానుడి భగభగలతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల్లో ఉపరితల ద్రోణి ప్రభావంతో 3 రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రస్తుతం దక్షిణ అంతర్గత కర్ణాటక నుంచి తమిళనాడు మీదుగా మున్నార్ గల్ఫ్ వరకు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఈ ద్రోణి విస్తరించి ఉన్నట్టు వెల్లడించింది. గురువారం నుంచి శనివారం వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. గంటకు 50 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని, ఉరుములు మెరుపులతో కూడిన వానలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.