నిందితులను అరెస్ట్ చేయాలని డిమాండ్
NEWS Apr 29,2026 09:42 pm
చిత్తూరు జిల్లా వీ.కోట ఆంధ్రజ్యోతి జర్నలిస్ట్ జగన్మోహన్ రెడ్డి హత్య కేసులో నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ APUWJ ఆధ్వర్యంలో కర్నూలులో జర్నలిస్టులు ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ముందు ధర్నా చేపట్టారు. అనంతరం డీఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో IJU జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈ.ఎన్.రాజు, వెంకట సుబ్బయ్య, నాగరాజు, శ్రీనివాస్ గౌడ్, చంద్రశేఖర్, బోయ క్రాంతి నాయుడు, లెనిన్, రఫీ, సుధాకర్‌తో పాటు ఫోటో, వీడియో జర్నలిస్టులు పాల్గొన్నారు.