కోట్లు కురిపిస్తున్న పాముల ఫాం!
NEWS Apr 29,2026 12:04 pm
చైనాలోని గ్వాంగ్జీ ప్రావిన్స్‌కు చెందిన క్విన్ అనే యువతి డిగ్రీ తర్వాత తండ్రి నిర్వహిస్తున్న పాముల ఫాంను స్వీకరించి పాముల పెంపకాన్ని లాభదాయక వ్యాపారంగా మార్చి ఏటా కోట్లు సంపాదిస్తోంది. ప్రస్తుతం ఆమె ఫాంలో 60 వేల పాములు ఉన్నాయి. వీటిలో 50 వేల ఫైవ్ స్టెప్ వైపర్స్, 10 వేల నాగుపాములు ఉన్నాయి. పాముల విషం, ఎండబెట్టిన పాములు, పాము మాంసం, పాము నూనెకు చైనాలో భారీ డిమాండ్ ఉంది. గ్రాముకు 40 నుంచి 200 యువాన్ల వరకు ధర లభిస్తుండగా, పెద్ద పాములు వెయ్యి యువాన్లకు పైగా అమ్ముడవుతున్నాయి.