జేబులో ఉల్లిపాయతో వేడి పరార్
NEWS Apr 28,2026 02:43 pm
ఎండ నుంచి తట్టుకునేందుకు తమ జేబులో ఉల్లిపాయ ఉంచుకోవాలని కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సూచించారు. ‘అందరూ మొబైల్ ఫోన్లను వాడుతుంటే నేను మాత్రం జేబులో ఉల్లిపాయ పెట్టుకుని తిరుగుతున్నా. ఎండ తీవ్రత నుంచి శరీర ఉష్ణోగ్రతను నియంత్రించడంలో ఇది ఉపయోగపడుతుంది. కారులోనూ నేను ఏసీ వాడను. జేబులో ఓ ఉల్లిపాయ ఉంటే 51 డిగ్రీల ఎండలోనూ మనకు ఏమీ జరగదు’ అని సింధియా చెప్పారు.