మొక్కజొన్న కొనుగోలు కేంద్రం ప్రారంభం
NEWS Apr 25,2026 08:57 pm
నర్సాపూర్ జి మండలం టెంబూర్ణి గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని సర్పంచ్ లలిత శ్రీధర్ రెడ్డి ప్రారంభించారు. రైతులు తమ మొక్కజొన్న పంటను దళారులకు అమ్మకుండా నేరుగా ప్రభుత్వ కొనుగోలు కేంద్రంలోనే విక్రయించాలని ఆమె సూచించారు. రైతులకు సరైన ధర లభించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని తెలిపారు. ఉపసర్పంచ్ బ్యాగరీ ముత్యం, వీడీసీ సభ్యులు, రైతులు పాల్గొన్నారు. ఈ కేంద్రం ద్వారా స్థానిక రైతులకు ప్రయోజనం కలగనుందని ఆశాభావం వ్యక్తమైంది.