భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహాడ్ మండలంలోని సారపాక ప్రాంతంలో ఓ జమైల్ తోటలో గుట్టుచప్పుడు కాకుండా నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు మెరుపు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో పేకాట ఆడుతున్న 11 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. వారి వద్ద నుంచి సుమారు రూ.57 వేల నగదును స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. పట్టుబడిన వారిని స్థానిక పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారణ కొనసాగిస్తున్నట్లు సమాచారం.