మాజీ మంత్రి మల్లారెడ్డి బీజేపీలో చేరతారంటూ వస్తున్న వార్తలకు కోడలు ప్రీతి రెడ్డి చెక్ పెట్టారు. ప్రీతి రెడ్డి బీజేపీ కార్యాలయానికి వెళ్లి అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. తాను కేంద్ర మంత్రి బండి సంజయ్‌తో టచ్‌లో ఉన్నది వాస్తవమే అని అన్నారు. అయితే బీజేపీలో చేరతానంటూ వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని స్పష్టం చేశారు. సామూహిక వందేమాతర గీతాలాపన కోసం మోదీని కలిసి ఆహ్వానించినట్లు చెప్పారు. మోదీ వస్తే పెద్ద ఈవెంట్ అవుతుందన్నారు. అందులో భాగంగానే ఇవాళ బీజేపీ కార్యాలయంలో చంద్ర శేఖర్ తివారీని కలిసి ఆహ్వానించినట్లు తెలిపారు.