చిన్నారుల ఆరోగ్యమే దేశ భవిష్యత్తు
NEWS Apr 23,2026 10:11 pm
మంత్రాలయం ఐసిడిఎస్ కార్యాలయంలో పోషణ పక్వడ కార్యక్రమం ముగిసింది. ఏప్రిల్ 9 నుంచి కొనసాగిన ఈ కార్యక్రమం "మొదటి ఆరేళ్లలో చిన్నారుల మెదడు అభివృద్ధి" అనే ప్రధాన ఇతివృత్తంతో నిర్వహించారు. ప్రాజెక్టు ఆఫీసర్ రాజేశ్వరి మాట్లాడుతూ, పిల్లల సర్వతోముఖాభివృద్ధికి మొదటి 1000 రోజులు అత్యంత కీలకమని పేర్కొన్నారు. అంగన్‌వాడీ సూపర్వైజర్ సుమిత్ర, కార్యకర్తలు భీమేశ్వరి, కళ్యాణి కూడా తల్లిదండ్రులకు పోషకాహారం, శిశు సంరక్షణపై అవగాహన కల్పించారు. చిన్నారుల ఆరోగ్యమే దేశ భవిష్యత్తని వారు స్పష్టం చేశారు.