ఘనంగా గ్రామదేవతల దేవర వేడుక
NEWS Apr 23,2026 10:23 am
ఎమ్మిగనూరు నియోజకవర్గం నందవరం మండలం నాగలదిన్నె గ్రామంలో గ్రామదేవతల దేవర కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే డా. బీవీ జయనాగేశ్వర్ రెడ్డి పాల్గొని మారెమ్మ, పెద్దమ్మ, చిన్నమ్మ దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గ్రామంలోని టీడీపీ నాయకులు, కార్యకర్తల ఇళ్లకు వెళ్లి కుటుంబ సభ్యులను పలకరించి దేవర శుభాకాంక్షలు తెలిపారు. శ్రీనివాస రెడ్డి నివాసంలో భోజనం చేశారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.