నిర్మాత, విశ్లేషకులు చిట్టిబాబు కన్నుమూత
NEWS Apr 22,2026 11:12 am
నిర్మాత, విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు (71) కన్నుమూశారు. గుండెపోటుతో హైదరాబాద్‌లోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. చిట్టిబాబు తన కెరీర్‌లో 12 సినిమాలకు దర్శకత్వం వహించారు. 49 చిత్రాలకు కో డైరెక్టర్‌గా పనిచేశారు. 30కి పైగా సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా మెప్పించారు. అలాగే నిర్మాతగానూ పలు సినిమాలు చేశారు. దివంగత నటి సౌందర్యను ఇండస్ట్రీకి పరిచయం చేసింది కూడా చిట్టిబాబునే.