మే 1న ‘ఓ తండ్రి కథ’ మూవీ విడుదల
NEWS Apr 19,2026 08:45 am
వైఎస్‌కె, నిహారిక చౌదరి, వరేణ్య ఆగ్రా, అశోక్ రెడ్డి లెంకల ప్రధాన పాత్రల్లో, నంది వెంకట్ రెడ్డి తెరకెక్కించిన మూవీ ‘ఓ తండ్రి కథ’. అశోక్ రెడ్డి లెంకల నిర్మించారు. తెలుగు ఫిలిం ఛాంబర్‌లో ట్రైలర్, పాటలు విడుదలయ్యాయి. మే 1న విడుదల అయ్యే ఈ సినిమాను అభినందిస్తూ, అతిథులు దర్శకులు, వి సముద్ర, సంజీవ్ కుమార్ మేగోటి, తదితరులు చిత్ర యూనిట్ కి అభినంద నలు తెలిపారు. కుటుంబ విలువలను ప్రతిబిం బించే ఈ చిత్రం ప్రేక్షకులను కదిలిస్తుందని చిత్రబృందం ఆశాభావం వ్యక్తం చేసింది.