వివాదంపై స్పందించిన ప్రకాష్ రాజ్
NEWS Apr 19,2026 11:29 am
ఓ కార్యక్రమంలో తాను చేసిన ప్రసంగంలోని కొన్ని మాటలను మాత్రమే తీసుకుని కొందరు వక్రీకరించారని నటుడు ప్రకాష్ రాజ్ అన్నారు. తాను శ్రీరాముడి గురించి తప్పుగా మాట్లాడానని, హిందువుల మనోభావాలను గాయపరిచాననడం సరికాదని, అన్ని ధర్మాలను గౌరవించే తనకు ఎవరినీ తక్కువ చేసే అవసరం లేదని, తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పలేక కొందరు రాజకీయ నాయకులు తనను 'హిందూ వ్యతిరేకి'గా చిత్రీకరిస్తున్నారని విమర్శించారు.