కాంగ్రెస్‌లో చేరిన పలువురు నేతలు
NEWS Apr 19,2026 11:13 am
కామారెడ్డి పట్టణ కేంద్రంలో టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జనసేన జిల్లా నాయకులు, కామారెడ్డి క్రెడా సంఘం అధ్యక్షుడు గణగోన లక్ష్మి నర్సాగౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారితో పాటు క్రెడా ప్రధాన కార్యదర్శి రాంచందర్ నాయక్, కోశాధికారి మాదాస్ రాజలింగంలను కూడా పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. కాంగ్రెస్ ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై నమ్మకంతో పార్టీలో చేరుతున్నట్లు నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా గడ్డం చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కలిసి పని చేయాలని పిలుపునిచ్చారు.