ధరలు తగ్గి వస్తున్న ముడిచమురు!
NEWS Apr 17,2026 10:28 pm
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇజ్రాయెల్-లెబనాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన నేపథ్యంలో, 'హర్మూజ్ జలసంధి'ని వాణిజ్య నౌకల రాకపోకల కోసం పూర్తిగా తెరిచినట్లు ఇరాన్ ప్రకటించింది. ఈ పరిణామంతో అంతర్జాతీయ మార్కెట్‌లో ముడిచమురు ధరలు సుమారు 8-10% మేర భారీగా తగ్గాయి. ఇది భారత్ వంటి చమురు దిగుమతి దేశాలకు ఊరటనిచ్చే అంశం.