ఏపీలో ఇంటింటి గణన ప్రారంభం
NEWS Apr 16,2026 07:01 pm
ఆంధ్రప్రదేశ్‌లో ఇంటింటి గణన, గృహాల జాబితా సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. స్వీయ నమోదు (సెల్ఫ్ ఎన్యూమరేషన్) ప్రక్రియను se.census.gov.inలో సీఎం చంద్రబాబు స్వయంగా తన వివరాలను నమోదు చేసి ఆరంభించారు. సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియలో మొత్తం 33 ప్రశ్నలు ఉంటాయి. ప్రజలు తమ వివరాలను ఆన్‌లైన్‌లో స్వయంగా నమోదు చేసుకునేందుకు ఈ నెల 30 వరకు అవకాశం కల్పించారు.