TM: కన్యాకుమారిలో సైకిల్ ర్యాలీ సందర్భంగా విజయ్ వైపు ఓ అభిమాని పూలతో చేసిన చిన్న బంతిని విసరడంతో కాసేపు ఉద్రిక్తత నెలకొంది. అది బాంబు కావచ్చని అనుమానంతో విజయ్ వెంటనే సైకిల్ దిగి భద్రతా సిబ్బంది వైపు పరుగెత్తారు. తరువాత అది పూల బంతి అని తేలడంతో పరిస్థితి సర్దుకుంది. తొక్కిసలాటలో ఒక పోలీసు అధికారి కిందపడ్డారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.