13న బీఆర్ఎస్‌లోకి జీవన్ రెడ్డి
NEWS Apr 08,2026 10:05 pm
TG: ఇటీవల కాంగ్రెస్‌ను వీడిన సీనియర్ నేత జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ కీలక నేత కేటీఆర్ గురువారం కలవనున్నారు. జగిత్యాల వెళ్లి ఆయనను పార్టీలోకి ఆహ్వానిస్తారు. ఈనెల 13న కేసీఆర్ సమక్షంలో జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకునే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యే సంజయ్ బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరగా, కాంగ్రెస్‌లో ఉన్న జీవన్ రెడ్డి బీఆర్ఎస్‌లోకి వెళ్లనున్నారు. దీంతో జగిత్యాలలో రసవత్తర రాజకీయాలకు తెర లేవనుంది.