వేదనే బతుకైతే.. విడాకులు వేడుకే
NEWS Apr 06,2026 11:10 am
ఉత్తర్‌ప్రదేశ్: మేరఠ్‌కు చెందిన రిటైర్డ్ జడ్జి జ్ఞానేంద్ర శర్మ కుటుంబం సామాజిక పద్దతులకు భిన్నంగా కుమార్తె ప్రణీత వశిష్ఠ విడాకులను వేడుకలా జరుపుకుంది. 2018లో ఆర్మీ మేజర్‌తో పెళ్లైన ప్రణీతకు విభేదాలు రావడంతో కోర్టు విడాకులు మంజూరు చేసింది. కోర్టు నుంచి బయటకు వచ్చిన వెంటనే కుటుంబ సభ్యులు పూలమాలలు వేసి, మేళతాళాలతో ఆమెను ఇంటికి తీసుకెళ్లారు. ‘‘ఐ లవ్ మై డాటర్’’ టీషర్టులతో ఆమెకు మద్దతు తెలిపారు. కుమార్తె సంతోషమే ముఖ్యమని, ఆమె ఆస్తి కాదని, భరణాలు అవసరం లేదని తండ్రి చెప్పారు.