నేపాల్ ప్రధానిగా బలేంద్ర షా ప్రమాణం
NEWS Mar 28,2026 01:26 pm
నేపాల్ నూతన ప్రధానిగా ఆర్ఎస్‌పీ అధినేత బలేంద్ర షా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా భారత ప్రధాని మోదీ ఆయనకు శుభాకాంక్షలు తెలుపగా, ఇరు దేశాల మధ్య బహుముఖ సంబంధాలను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు కలిసి పనిచేస్తానని షా ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరు దేశాల పౌరుల ప్రయోజనాల కోసం మైత్రిని ఉన్నత శిఖరాలకు చేర్చేందుకు సిద్ధంగా ఉన్నానని మోదీ పేర్కొన్నారు.