బొకేలు వద్దు.. మొక్కలు ముద్దు
NEWS Mar 27,2026 04:24 am
కొత్తగూడెం పట్టణంలోని ప్రముఖ వైద్యుడు డాక్టర్ వరుణ్ కుమార్‌ను ప్రకృతి ప్రేమికుడు, యంగ్ ఇండియా జాతీయ పురస్కార గ్రహీత బాలునాయక్ మర్యాదపూర్వకంగా కలిసి మొక్కలను అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ వరుణ్ కుమార్ మాట్లాడుతూ “బొకేలు వద్దు.. మొక్కలు ముద్దు” అంటూ పర్యావరణ పరిరక్షణ అవసరాన్ని వివరించారు. సమాజ సేవలో భాగంగా ప్రకృతి సంరక్షణకు కృషి చేస్తున్న కిన్నెరసాని మోడల్ క్రీడా పాఠశాల ఆంగ్ల ఉపాధ్యాయుడు బాలునాయక్‌ను ఆయన అభినందించారు.