పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూ
NEWS Mar 26,2026 08:53 am
పెట్రోల్ కొరత లేదని తెలంగాణ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రకటన, 2 నెలలకు సరిపడా పెట్రోల్, డీజిల్ నిల్వలు అందుబాటులో ఉన్నాయని, భయాందోళనలకు గురికావద్దని మంత్రి ఉత్తమ్ వివరణ. కలెక్టర్, పోలీసులు, పౌరసరఫరాల శాఖ అధికారులు.. అందరిదీ అదే మాట. కానీ పరిస్థితులు మాత్రం ఇందుకు భిన్నం. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పెట్రోల్ బంకుల్లో 40% మేర మూతబడ్డాయి. తెరిచి ఉన్న ఏ పెట్రోల్ బంకు వద్ద చూసినా బారులు తీరిన కార్లు, ద్విచక్రవాహనాలు, భారీ సంఖ్యలో రోడ్లపైకి క్యూలు ఉన్నాయి.