కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ప్రకటించిన సీనియర్ నేత టి. జీవన్ రెడ్డిని బుజ్జగించేందుకు పార్టీ నాయకత్వం ప్రయత్నాలు చేస్తోంది. టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ జగిత్యాలలో ఆయనను కలిసి రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరారు. జీవన్ రెడ్డి సుదీర్ఘ రాజకీయ అనుభవం పార్టీకి ఎంతో అవసరమన్నారు. ఇటీవల మంత్రి శ్రీధర్ బాబు కూడా చర్చలు జరిపారు. జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ వ్యవహారశైలి పట్ల అసంతృప్తి కారణంగానే ఈ నిర్ణయమని “ఆత్మగౌరవమే ముఖ్యమని” జీవన్ రెడ్డి స్పష్టం చేశారు.