అమెరికా: రిఫ్లెక్ట్ ఆర్బిటల్ సంస్థ రాత్రి పూట కూడా సూర్యకాంతిని అందించే స్టార్టప్‌ను ప్రకటించింది. 600-625 కిలోమీటర్ల ఎత్తులో సూర్య అనువర్తిత కక్ష్యలో ఉపగ్రహాలను ప్రవేశపెట్టి, మైలార్ ఫలకాల ద్వారా సూర్యకాంతిని భూమిపై నిర్దిష్ట ప్రాంతాలకు పంపిస్తారు. ఒక్కో అద్దం 5 కి.మీ పరిధిలో 4 నిమిషాల పాటు చంద్రకాంతి స్థాయి వెలుగును ఇస్తుంది. App లో ఆర్డర్ చేయవచ్చు. ఇప్పటికే లక్షలాది మంది ఆసక్తి చూపారు.