విద్య రంగానికి కేటాయింపులపై విమర్శలు
NEWS Mar 20,2026 04:45 pm
తెలంగాణ బడ్జెట్‌లో విద్యారంగానికి పెద్దగా కేటాయించింది ఏం లేదని BRSV పాల్వంచ పట్టణ అధ్యక్షుడు దుర్గాప్రసాద్ మండిపడ్డారు. పాల్వంచలో ఆయన మాట్లాడుతూ.. గతేడాది రూ.23,108 కోట్లు కాగా ఈసారి రూ.26,674 ప్రతిపాదించారని విమర్శించారు. 26వేల పాఠశాలలు ఉండగా వాటిలో వందల భవనాలు శిథిలావస్థకు చేరుకున్నాయని తెలిపారు. 15% నిధులు కేటాయిస్తామని చెప్పి 7.6% మాత్రమే కేటాయించారని ఫైరయ్యారు.