హైదరాబాద్: తెలంగాణ గద్దర్ అవార్డుల కార్యక్రమంలో ‘రాజు వెడ్స్ రాంబాయి’ బెస్ట్ మూవీ, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ సింగర్, స్పెషల్ జ్యూరీ.. ఇలా 4 ప్రధాన కేటగిరీల్లో అవార్డ్స్ అందుకుంది. CM రేవంత్, డిఫ్యూటీ సీఎం భట్టి విక్ర మార్క, మంత్రి జూపల్లి కృష్ణారావు, FDC చైర్మన్ దిల్ రాజు చిత్ర యూనిట్‌ను అభినందించారు. మన కథని నమ్ముకున్న ప్రతి మనిషి గెలుపు అంటూ నిర్మాత వేణు ఉడుగుల సంతోషం వ్యక్తం చేశారు. చిత్రయూనిట్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది.