సిలిండర్ బుకింగ్‌లో అంతరాయం ఏర్పడొద్దనే ఉద్దేశంతో ఇండియన్ ఆయిల్ (IOCL) నూతన హెల్ప్‌లైన్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. వినియోగదారులు తమ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుంచి 8927225667కు మిస్డ్ కాల్ ఇచ్చి సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఫోన్ కాల్ ద్వారా బుక్ చేయాలనుకునే వారు 8391990070కు డయల్ చేయవచ్చు(IVRS). ఓల్డ్ నంబర్స్ కూడా పనిచేస్తాయని సంస్థ పేర్కొంది.