విజయ్‌కి డిప్యూటీ సీఎం పోస్టు ఆఫర్?
NEWS Mar 15,2026 06:42 pm
తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో BJP - TVK పార్టీల మధ్య పొత్తు విషయం హాట్ టాపిక్ అవుతోంది. పొత్తులో TVK అధినేత విజయ్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇస్తామని BJP ఆఫర్ చేసిందని వార్తలు వస్తున్నాయి. TVKకి 80 సీట్లు ఇచ్చేందుకు, విజయ్‌కు డిప్యూటీ సీఎం పదవిని BJP ఆఫర్ చేసినట్లు టాక్. సీఎం పదవిపై విజయ్ దృష్టి పెట్టారని, చర్చల్లో ఈ విషయం కీలకంగా మారిందని చెప్పాయి. ఇరు పార్టీల నుంచి అధికారిక ప్రకటన రాలేదు.