దేశంలో గ్యాస్ సిలిండర్ల కొరత కారణంగా ప్రజలు ప్రత్యామ్నాయంగా ఇండక్షన్ స్టవ్ ఎంచుకుంటున్నారు. దీంతో వీటి అమ్మాకాలు రికార్డు స్థాయిలో జరుగుతున్నాయి. సాధారణంగా నెలకు 1.80 లక్షల అమ్మకాలు జరిగే చోట ఒక్క రోజే అమెజాన్‌లో 1.34 లక్షలకు పైగా స్టవ్‌లు అమ్ముడయ్యాయి. ఆన్‌లైన్ అంతా Currently unavailable అని దర్శనిమిస్తున్నాయి. ఈ అనూహ్య డిమాండ్‌ను సంస్థలు సైతం ఊహించకపోవడంతో ‘అవుట్ ఆఫ్ స్టాక్’ బోర్డులు పెట్టాల్సిన పరిస్థితి.