సీతారామ కళ్యాణ మహోత్సవ పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే
NEWS Mar 13,2026 05:08 pm
నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిను 9వ వార్డ్ కౌన్సిలర్ శ్రీకాంత్ యాదవ్ కలిసి ఆయనకు శాలువా కప్పి, సత్కరించారు. అనంతరం వాల్మీకి నగర్‌లో జరగనున్న సీతారామ కళ్యాణ మహోత్సవంకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో వాల్మీకి నగర్ రామాలయ ఆలయ కమిటీ సభ్యులు, కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.